Tuesday, May 14, 2024

AP – గ్రహణ సమయంలో ముక్కంటి దర్శనం… ఎక్క‌డంటే….

ఇవాళ పాక్షిక చంద్రగ్రహణం ఉండ‌గా రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు ఆలయాలు మూతపడనున్నాయి. అయితే చంద్రగ్రహణం రోజు మూతపడని ఆలయం ఏపీలో ఉంది.. అదే తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాసంగా కాళహస్తీశ్వరాలయం. సూర్య, చంద్రగ్రహణాల సమయంలో కూడా శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం మూతపడక పోవడం ఇక్కడ ప్రత్యేకం.

క్షిణకాశీగా రాహుకేతు క్షేత్రంగా ఉన్న శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో అన్ని హిందూ ఆలయాలు మూసివేస్తే శ్రీకాళహస్తిలో క్షేత్రంలో గ్రహణ సమయం లో ముక్కంటి దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. గ్రహణ సమయంలో గ్రహణ కాలాభిషేకాలు నిర్వహిస్తారు. అంతేకాదు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. గ్రహణాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా గ్రహణ పట్టువిడుపు సమయాలలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక గ్రహణ కాలాభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ఆచారం. గ్రహణ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. ఈనెల 29 రాత్రి ఒంటిగంట నుంచి 2.10 నిమిషాలు గ్రహణం ఉంటుంది. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి గ్రహణ సమయంలో ఆలయాన్ని తెరిచి స్వామి, అమ్మవార్లకు గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement