Sunday, May 19, 2024

NZB: ఎమ్మెల్యే బాజిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు..

నిజామాబాద్ : నియోజకవర్గంలోని మంచిప్ప గ్రామానికి చెందిన వడ్డెర కులానికి చెందిన దాదాపు 50 మంది స్వచ్ఛందంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో తనకు మద్దతు తెలపాలని ఆ తర్వాత అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి వారికి మాటిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధార్థ, ఉపసర్పంచ్ జగదీష్, కోఆప్షన్ మెంబర్ అజింగ్, జై భారత్ యూత్ అధ్యక్షుడు సాయిరాం, సంగం అధ్యక్షులు మైసయ్య, లక్ష్మీనారాయణ, రాజన్న, శంకర్, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement