Monday, April 29, 2024

Andhra Pradesh – మార్చిలోనే టెన్త్, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు…టైమ్ టేబుల్ ఇదే

అమ‌రావ‌తి – ఇంటర్, పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను అవసరమైతే భవిష్యత్‌లో విడుదల చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు ఇంటర్, పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి చెప్పారు. పదవ తరగతి విద్యార్థులు 6 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు 10 లక్షల మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు.

మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షల తేదీలను విద్యా శాఖ ఖరారు చేసింది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఉంటే.. రెండో రోజు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31 వరకు 12 రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9.30 నుంచి 12.45 నిమిషాలకు వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్

మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20న ఇంగ్లీష్
మార్చి 22న మ్యాథ్స్
మార్చి 23న ఫిజికల్ సైన్స్,
మార్చి 26న బయాలజీ
మార్చి 27న సోషల్ స్టడీస్
మార్చి 28న మొదటి లాంగ్వేజ్ పేపర్-2
మార్చి 30న లాంగ్వేజ్ పేపర్-2, వొకేషనల్ కోర్సు పరీక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement