Monday, April 29, 2024

KNR: ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా వినోద్.. 4,892 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా పెద్దపల్లి పట్టణానికి చెందిన మాడూరి వినోద్ కుమార్ గెలుపొందారు. ఫార్మసీ కౌన్సిల్ సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నిక లో వినోద్ కుమార్ కు 6659 ఓట్లు రాగా సమీప అభ్యర్థికి 1767 ఓట్లు రావడంతో వినోద్ కుమార్ 4892 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

ఎన్నికల అధికారి హరి చందన వినోద్ కు ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా గెలుపొందిన సర్టిఫికెట్ను అందజేశారు. వినోద్ కుమార్ గెలుపొందడం పట్ల పెద్దపల్లి జిల్లా ఫార్మసీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement