Thursday, May 16, 2024

Delhi | రైల్వేలో రెండేళ్లలో రూ.59,837 కోట్లు సబ్సిడీ ఇచ్చాం… కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ రైల్వే సమాజంలోని అన్ని వర్గాల వారికి సరైన సేవలందించడమే కాకుండా 2019 -2020లో వివిధ పథకాల కింద రూ.59,837 కోట్ల సబ్సిడీని అందించిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. రైల్వేలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి సగటున 53 శాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు. వివిధ కేటగిరీలకు చెందిన  దివ్యాంగులు, రోగులు, విద్యార్థులకు రాయితీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

జర్నలిస్టుల రాయితీ రైల్వే పాసుల గురించి బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు సంబంధించి ఆపివేసిన రైల్వే పాసులను వెంటనే పునరుద్దరించి, తగిన చర్యలు తీసుకోవాలని తాను చేసిన అభ్యర్థిపై కేంద్రమంత్రి స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement