Saturday, April 27, 2024

Andhra Pradesh – టిడిపి మూడో జాబితాలో సీనియర్లు గల్లంతు..

టీడీపీ మూడో జాబితా విడుదల
ఆచితూచి ఎంపిక చేసిన చంద్ర‌బాబు
దేవినేని, కళా, గంటా, బండారుకు నో చాన్స్‌
13 లోక్‌స‌భ‌, 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ప్ర‌క‌ట‌న‌
టిక్కెట్ ద‌క్క‌ని లీడ‌ర్ల‌లో ఆందోళ‌న‌

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – తెలుగుదేశం పార్టీ లోక్‌స‌భ‌, అసెంబ్లీకి చెందిన అభ్య‌ర్థుల మూడో జాబితాని శుక్ర‌వారం ఉద‌యం రిలీజ్ చేసింది. జనసేన, బీజేపీతో పొత్తు నేపథ్యంలో తాము గెలవాల్సిన సీట్లల్లో అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆచీతూచీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ రెండు జాబితాలను అధిష్టానం విడుదల చేయగా, నిన్న జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్‌తో చర్చల అనంతరం మూడో జాబితాను శుక్రవారం బాబు విడుదల చేశారు. ఈ జాబితాలో 13 మందితో లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పెట్టారు. అలాగే.. 11 అసెంబ్లీ స్థానాలను కూడా చంద్ర‌బాబు ఈ జాబితాలో వెల్ల‌డించారు. దీంతో ఎన్నికల బరిలో నిలబడే టీడీపీ అభ్యర్థుల సంఖ్య 137 కు చేరింది. కనీసం ఈ జాబితాలో సీట్ల పైన ఆశలు పెట్టుకున్న సీనియర్ లీడర్లు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకట్రావు పేర్లు కనపడలేదు. దీంతో సీనియర్లలో ఆందోళన క‌నిపిస్తోంది.

టీడీపీ లోక్‌స‌భ‌ అభ్యర్థులు వీళ్లే..

శ్రీకాకుళం – కింజరపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్
అమలాపురం – గంటి హరీష్ మాధుర్ఏ
లూరు – పుట్టా మహేష్ యాదవ్వి
జయవాడ – కేశినేని శివనాథ్ ( చిన్ని)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట – లావు శ్రీ కృష్ణదేవరాయలు
బాపట్ల – టి. కృష్ణ ప్రసాద్‌
నెల్లూరు -వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు
కర్నూలు– బస్తిపాటి నాగరాజు
నంద్యాల – బైరెడ్డి శబరి
హిందూపూర్ – బీకే పార్థసారథి

అక్కడ మతాబులు… ఇక్కడ మంటలు

- Advertisement -

టీడీపీ మూడోవ జాబితా విడుదల అనంతరం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపించ‌గా.. మరో వైపు సీటు దక్కని నేతల అనుచర వర్గం ఆందోళన, ఆగ్రహంతో ర‌గిలిపోతోంది. నరసరావుపేటలో డాక్టర్ అరవింద బాబుకు టిక్కెట్టు ఇవ్వాల్సిందేనని టీడీపీ శ్రేణులు రెండు రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామిరెడ్డి అనే టీడీపీ కీలక నేత ఏకంగా ఆత్మహత్యకు యత్నించారు. పైగా ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు డాక్టర్ అరవిందు బాబుకు టిక్కెట్టు ఖరారు చేయటంతో స్థానిక కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. ఇక నిన్నటి వరకూ కుతకుతలాడిన పెనంలూరు.. చల్లారి పెనమలూరుగా మారింది. తనకు టిక్కెట్లు వస్తుందో రాదోనని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎంతో మధనపడ్డారు. ఒకసారి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు, మరో సారి ఆలపాటి రాజా పేరు తెరమీదకు రావటంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఖిన్నులయ్యారు. ఇలాంటి స్థితిలో బోడే ప్రసాద్ కే టిక్కెట్టు ఖరారు కావటంతో.. పెనమలూరు టీడీపీ శ్రేణులు ఇక గెలుపు మాదే అంటూ సంబరాలు చేస్తున్నారు.

మైలవరంలో మంటలు

మైలవరం టిక్కెట్టు వసంత కృష్ణ ప్రసాద్ కే దక్కటంతో … ఇటు మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు, అటు స్థానిక నేతలు బొమ్మసాని సుబ్బారావు, గన్నే ప్రసాద్ వర్గాలు నిరుత్సాహపడ్డాయి. ముఖ్యంగా ఎట్టి పరిస్థితిలోనూ చివరి క్షణంలోనైనా అధిష్టానం కరుణిస్తుందని ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమా బిక్క చచ్చిపోయారు. టిక్కెట్టు కోరిన వర్గం వసంత కృష్ణ ప్రసాద్తో పని చేయటానికి అంగీకరించటం లేదు. ఉమా వర్గీయులైతే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఈ వర్గాలను ఏరీతిలో సముదాయిస్తుందో వేచి చూడాల్సిందే.

శ్రీకాకుళంలో అగ్గి మీద గుగ్గిలం

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గం ఇంచార్జ్ గుండ లక్ష్మీదేవికి కాకుండా గొండు శంకరకు ఇస్తున్నట్లు ప్రకటించడంతో గుండ లక్ష్మీదేవి అనుచరులు, అభిమానులు, పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవికి టిక్కెట్ రాకపోవడంతో శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లిస్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తీవ్ర వత్తిడి తీసుకు వచ్చారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ చెందిన బ్యానర్లను, గుండు లక్ష్మీదేవి దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలనుతగులు పెట్టారు. అభిమానులు, అనుచరులు కార్యకర్తలు నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఆమె రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా? వద్దా? అన్నదానిపై అమెరికాలోని ఆమె కుమారుడు శివగంగాధరతో ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో శివ గంగాధర్ జిల్లాకు వచ్చి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై తెలియజేస్తారని, ఆ మేరకు గుండ దంపతులు ఒక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులు ..
శ్రీకాకుళం– గొండు శంకర్ప
లాస – గౌతు శిరీష
పాతపట్నం – మామిడి గోవింద్ రావు
శృంగవరపు కోట– కోళ్ల లలిత కుమారి
కాకినాడ సిటీ– వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం– అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు– బోడె ప్రసాద్
మైలవరం – వసంత కృష్ణ ప్రసాద్
న‌రసరావుపేట– చదలవాడ అరవింద్ బాబు
చీరాల– మాల కొండయ్య
సర్వేపల్లి– సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement