Saturday, April 27, 2024

ప్రేమ విఫలమై.. యువకుడు ఆత్మహత్య

అనంతపురం ఓల్డ్ టౌన్ : అనంతపురంలోని ఓల్డ్ టౌన్ వేణుగోపాల్ నగర్ లో నివాసముంటున్న ఓ యువ‌కుడు తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ రవిశంకర్ రెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకి గల కారణాలని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య ఒక కారణం కాకూడదని, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం మార్గం ఉంటుందని యువత దీనిపైన జాగృతి పొందాలని సీఐ రవిశంకర్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement