Friday, May 3, 2024

అనంత‌లో అకాల వ‌ర్షం – పంట‌ల‌కు భారీ న‌ష్టం

అనంతపురం : అనంతపురం జిల్లా రైతులు అకాల వర్షాలతో అల్లాడిపోతున్నారు. చేతికి వచ్చిన పంటలు ఈదురుగాలి, వర్షాల కారణంగా నేలపాలయైపో తున్నాయి. అరటి, బొప్పాయి, బత్తాయి, మామిడి, దానిమ్మ,కర్బూజ, దోస తదితర పండ్ల తోటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీనికి తోడు కూరగా యపంటలైన టమోట,బీన్స్‌, మిర్చి, చిక్కుడు, కాకరకాయ, బీరకాయ తదితర పంటలు మడకశిర, అమరాపురం, అగళి, మండలాల్లో తమలపాకు తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. భారీగా ఈదురుగాలులు, పిడుగుపాటు కారణంగా ఇళ్ల పైకప్పులు లేచిపోవడం, పిడుపాటుకు ఆవులు, గేదెలు మృతి చెందుతున్నాయి. శనివారం 28 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అమడగూరు 47.6, మిల్లి మీటర్ల వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల పండ్లతోటలకు నష్టం వాటిల్లింది.భారీగా వీచిన గాలులకు ఓబుళదేవరచెరువు మండలకేంద్రంలో కుట్టుమిషన్‌ సెంటర్‌ కు సంబంధించిన రేకులు గాలిలో కొట్టుకుపోయాయి. దీనివల్ల 30 మంది కూలీలు ఉపాధిని కొల్పో యారు. కుట్టడానికి ఆర్డర్‌ వచ్చిన బట్టలు వర్షానికి తడిచి పోవడంతో మరిం తనష్టం జరిగిందని కుట్టు మిషన్‌ సెంటర్‌ యజమాని వాపోయారు. ఈ వారం రోజు లుగా కురుస్తున్న వర్షాల కారణంగా 154.71 హెక్టార్లలో పండ్లతొ టలకు సంబంధించి నష్టం వాటిల్లిందని ఉధ్యాన వనశాఖ అధికారులు లెక్కులు తేల్చారు. దీనివల్ల రూ.294.52 లక్షల మేరకు నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదించారు. ఇదే విధంగా వరి, వేరుశనగ తదితర పంటల ను బోర్లు, బావులు, చెరువుల కింద సాగుచేస్తున్నారు. అకాల వర్షాలతో వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవ సాయ శాఖ అధికారులు అంచనా వేశారు. సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఇదే విధంగా పిడుగుపాటు కారణంగా అమడగూరు మండలం జౌకల గ్రామంలో నాలుగు జర్సీ ఆవులు మృతి చెం దాయి. కంబదూరు మండలంలో ఒకటి పిడుగు పాటుకు గురైంది. పాల వ్యాపారం చేసుకుంటున్న ఆ రైతు కుటుంబాలు జీవనాధా రాన్ని కొల్పోయారు. పశువుల మృతి వల్ల ఐదు లక్షల రూపా యల పెట్టుబడిని కొల్పొయి నట్లు తెలిపారు. ఒకవైపు కరోనా వల్ల ఇబ్బందులు పడుతుం డగా మరోవైపు అకాల వర్షాలకు ఆదాయానికి గండికొట్టా యని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement