Tuesday, October 8, 2024

ATP: కూలిన వంతెన.. తప్పిన ప్రమాదం..

ఓ వాహనం వెళ్తున్న సమయంలో వంతెన కూలిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కణేకల్లు మేజర్ గ్రామ పంచాయతీ మజరా ప్రాంతం గంగులపురం-కణేకల్లు టౌన్ కు వారధిగా ఉన్న కణేకల్లు చిక్కణ్ణేశ్వర చెరువు ఔట్ ఫాల్ రెగ్యులేటర్ హెచ్ఎల్సీ అక్విడెక్ట్ అకస్మాత్తుగా కూలి పోయింది. వడ్ల లోడ్ తో ఐచర్ వ్యాన్ వెళ్తున్న సమయంలో రెగ్యులేటర్ కూలింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement