Thursday, May 2, 2024

Milk Rates: పాల ధ‌ర పెంచేసిన‌ అముల్‌.. రేప‌టి నుంచే అమ‌లులోకి

అముల్ సంస్థ పాల‌పై రేటును పెంచేసింది. లీట‌రు పాల‌పై 2 రూపాయ‌ల చొప్పున పెంచిన‌ట్లు పేర్కొంది. ఈ పెంచిన ధ‌ర మార్చి ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి. చివ‌రిసారి జూలై 2021లో అముల్ సంస్థ పాల రేటును పెంచింది. అముల్ బ్రాండ్‌లో వ‌స్తున్న అన్ని పాల ఉత్ప‌త్తుల‌పై పెరిగిన ధ‌ర‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆ సంస్థ తెలిపింది.

గోల్డ్‌, తాజా వేరియంట్ పాల‌పై కూడా ఈ కొత్త ధ‌ర‌లు అమ‌లులోకి రానున్నాయి. ఆవు, బ‌ర్రె పాల‌కు చెందిన అన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌కు కొత్త రేటు వ‌ర్తిస్తుంది. కొత్త ధ‌ర ప్ర‌కారం.. 500 మిల్లీలీట‌ర్ల అముల్ గోల్డ్ పాల పాకెట్‌ ఇప్పుడు రూ.30కు ల‌భిస్తోంది. అముల్ తాజా వేరియంట్ రూ.24 అర లీట‌రు వ‌స్తోంది. హాఫ్ లీట‌ర్ అముల్ శ‌క్తిని 27కి అమ్మ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement