Thursday, April 25, 2024

ఉక్రెయిన్‌లోనే ఉండండి.. ప్రవాస చైనీయులకు బీజింగ్‌ ఆదేశం

యుద్ధపీడిత ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తమవారిని దేశానికి తీసుకువచ్చే పరిస్థితులు లేవని, తరలింపు ప్రమాదకరమని, అందువల్ల తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఆ దేశంలోనే సురక్షిత ప్రాంతాల్లో బస చేయాలని ప్రవాస చైనీయులకు బీజింగ్‌ సూచించింది. ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేసింది. ప్రవాస చైనీయులను సురక్షితంగా దేశానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు వియ్‌చాట్‌ సామాజిక మాధ్యమంలో చైనా రాయబారి ఫాన్‌ గ్జియాన్‌ రోంగ్‌ సుదీర్ఘ వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారని ప్రచారం జరిగిన నేపథ్యంలో రోంగ్‌ స్పందించారు. సురక్షితంగా దేశానికి చేర్చగలమనే పరిస్థితులు ఏర్పడగానే ఆ పని చేస్తామని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement