Friday, April 26, 2024

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య..

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం శ్రీశైలం పరిధిలో చోటుచేసుకుంది. శ్రీశైలంలోని ఎస్టీ కాలనీకి చెందిన సంతోష్ నాయక్ అనే యువకుడు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఔటర్ రింగ్ రోడ్డులోని సమీప అటవీ ప్రాంతంలో ఉరివేసుకోవడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ విఫలం కావడం వల్లే సంతోష్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికుల సమాచారం. సంబంధిత యువకుడు దేవస్థానంలో తోటమాలిగా పనిచేస్తుండడం విశేషం. శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement