Thursday, April 25, 2024

‘వకీల్ సాబ్’ నుంచి ‘మగువా.. మగువా’ వీడియో సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ‘మగువా.. మగువా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించాడు. మహిళల ఔన్నత్యాన్ని వివరిస్తూ సాగే ఈ పాటను ఆడియోను తొలుత గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు విడుదల చేయగా అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. తాజాగా వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఈ వీడియో సాంగ్ వైరల్‌గా మారింది.

దిల్‌రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరుపై నిర్మితమైన ఈ మూవీకి వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కానీ కరోనా మహమ్మారి వల్ల కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దీంతో పవన్ అభిమానులు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement