Saturday, April 20, 2024

ఛీఛీ..ఆక్సిజను అడిగితే శృంగారం చేయమన్నాడు

క‌రోనా మ‌హ‌మ్మారి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అండ‌గా నిల‌వాల్సిన కొంద‌రు మృగాళ్ల మారుతున్నారు. ఆక్సిజ‌న్ కావాలి అని వ‌రుస‌కు సోద‌రుడైన ఓ వ్య‌క్తిని యువ‌తి అడ‌గ్గా.. ఆమెకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ కావాలంటే.. త‌న‌తో శృంగారం చేయాల‌ని డిమాండ్ చేశాడు.ఈ విష‌యాన్ని ఓ యువ‌తి త‌న ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేసింది. నా స్నేహితుడి చెల్లి తండ్రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌కు గుర‌య్యాడు. ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ సాయం చేయాల‌ని పొరుగింటి వ్య‌క్తిని(వ‌రుస‌కు సోద‌రుడు) ఆమె అడిగింది. అందుకు అత‌ను స్పందిస్తూ త‌న‌తో శృంగారం చేస్తే ఆక్సిజ‌న్ స‌మ‌కూర్చుతాన‌ని చెప్పాడు. అత‌ని మాట‌లు విన్న ఆమె షాక్‌కు గురైంది అని తెలుపుతూ ట్వీట్‌లో పేర్కొంది. అయితే ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలని అంటూ నెటిజ‌న్లు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement