Thursday, April 25, 2024

శాకుంత‌లం నుంచి మ‌ల్లిక సాంగ్ రిలీజ్ – వీడియోతో

గుణ శేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్‌ లవ్‌ స్టోరీలో సమంత, దేవ్‌మోహన్‌ జంటగా నటించారు. ఏప్రిల్‌ 14న రిలీజ్‌ అవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు గుణ శేఖర్‌. దిల్‌ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3డి -టె-క్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా త్రీడీ -టైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అలాగే నేడు ఈమూవీలోని మ‌ల్లిక సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..

ఈ సందర్బంగా ఏర్పాటు- చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ” శాకుంతలం సినిమాను 3డి -టె-క్నాలజీలోకి మార్చాలనే ఆలోచన దిల్‌రాజుగారిదే. మన మైథాలజీని ఇలా త్రీడీలో సినిమా చేయటం ఇదే తొలిసారి అనుకుంటా. మన సంస్కృతిని సెలబ్రేట్‌ చేసుకుంటు-న్నాం.” అన్నారు.

రచయిత సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ ” శాకుంతలం కథేంటో అందరికీ తెలిసిందే. అయితే గుణ శేఖర్‌గారు ఈ సినిమాను ఎలా చెబుతా రు. టేకాఫ్‌ ఎలా ఉంటు-ంది? అనే క్యూరియాసి టీ- కలిగింది. అందరూ ఊహించిన దాని కంటే విభిన్నంగా ప్రతీ నిమిషం సినిమా బావుంటు-ంది. ” అన్నారు.

నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ” శాకుంతలం బ్యూటీ-ఫుల్‌ ఫ్యామిలీ డ్రామా.. విజువల్‌ వండర్‌గా సినిమా తెరెక్కింది. ఓ థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే సినిమా. ఏప్రిల్‌ 14న ఫ్యామిలీస్‌ అంతా కలిసి ఎంజాయ్‌ చేసేలా ఉంటు-ంది. మన తదుపరి జనరేషన్‌కు మన కథ తెలియాలి. అందుకనే ఈ సమ్మర్‌లో ఏప్రిల్‌ 14న మా శాకుంతలం సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ” అన్నారు.

- Advertisement -

దర్శకు డు గుణ శేఖర్‌ మాట్లాడుతూ ”ఇది సమంతగారి శాకుంతలం. ఆమె ప్రాణం పెట్టి శకుంతల పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ” అన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement