Thursday, April 18, 2024

టోల్ దెబ్బ‌కు పెరిగిన టిఎస్ ఆర్టీసీ ఛార్జీలు..

హైద‌రాబాద్ – దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు గ‌త‌ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను కేంద్రం ఐదు శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై ఆర్టీసీ మోపింది. ఆర్టీసీ టికెట్‌లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచింది. టికెట్‌లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచుతూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడంతో టికెట్ ధరలు పెరిగాయి. నేటి ఉద‌యం నుంచే పెరిగిన టికెట్ ధరలు అమల్లోకి తీసుకొచ్చింది టిఎస్ఆర్టీసీ..పెరిగిన వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు రూ.4 టోల్‌ ఛార్జీలను పెంచారు. ఫలితంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement