Sunday, April 28, 2024

విజయ్ తో సినిమా… వెయిట్ చేయలేకపోతున్నానంటున్న పూజా

విజయ్ దళపతి 65వ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు సన్ టీవీ ఆఫీస్ లో పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి హీరో విజయ్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోయే పూజా హెగ్డే మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ఇదే విషయమై తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ బాధపడుతుంది. మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంవల్ల ముహూర్తపు పూజకు హాజరు కాలేకపోయాను అంటూ ట్వీట్ చేసింది. కానీ నా మనసంతా అక్కడే ఉందని టీంతో జాయిన్ అయ్యేందుకు వెయిట్ చేయలేక పోతున్నాను అంటూ పూజ హెగ్డే చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement