Saturday, October 12, 2024

మైక్ టైస‌న్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..వైర‌ల్ గా ఫొటో

ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం లైగ‌ర్. ఈ చిత్రంలో యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఈ సినిమాలో న‌టించ‌డం విశేషం. తాజా షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన టీం అమెరికా చేరుకోగా, ప్ర‌స్తుతం మైక్ టైస‌న్, విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. తాజాగా మైక్ టైస‌న్ చిత్ర బృందంతో క‌లిసాడు. విజ‌య్.. మైక్ టైస‌న్‌తో క‌లిసి వెరైటీగా ఫొటో దిగాడు. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డంపై సంతోషం వ్య‌క్తం చేశాడు. ఈ క్ష‌ణాల‌ను మ‌ర‌చిపోలేన‌ని తెలిపాడు. ఈ ఫొటో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement