Friday, April 26, 2024

తెలుగు చిత్రాల్లో విలన్లుగా.. బాలీవుడ్ స్టార్ హీరోస్

తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు బాలీవుడ్ నటులు..హిందీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న వారు తెలుగులో విలన్లుగా మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హిందీలో స్టార్లుగా వెలుగొందుతున్న అర్జున్ రామ్ పాల్ మరియు బాబీ డియోల్ తెలుగు చిత్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో “హరి హర వీరమల్లు” అనే పీరియాడికల్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. 17వ శతాబ్దం నాటి మొఘలుల కాలానికి చెందిన ఓ బందిపోటు వీరోచిత గాథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విలన్ గా బాబీ డియోల్ ని తీసుకున్నట్లు టాక్. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్ లో పవన్ కల్యాణ్ తో పాటుగా బాబీ కూడా పాల్గొంటారని అంటున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరమల్లు సినిమా వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.

ఇకపోతే నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న NBK108 చిత్రంలో అర్జున్ రాంపాల్ ని మెయిన్ విలన్ గా ఎంపిక చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ఇటీవల టీమ్ బాలీవుడ్ స్టార్ ను సంప్రదించారట. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న రాంపాల్.. ఇప్పుడు బాలయ్య చిత్రంలో విలన్ వేషాలు వేయడానికి ఓకే చెప్పాడట. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందనున్న NBK108 సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ గ్యాప్ లో దర్శకుడు కాస్ట్ అండ్ క్రూని ఫైనలైజ్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అఖండ కు వర్క్ చేసిన రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement