Friday, March 29, 2024

సొంత పార్టీపై రఘురామ క్రిష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు.. వైసీపీకి గట్టిగా ఇరవై సీట్లు వస్తే గొప్పే

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని సొంతపార్టీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు తెలిపారు. ఆయన తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు మాట దేముడు ఎరుగు.. గట్టిగా ఇరవై సీట్లు వస్తే గొప్పే అని ఆయన చెప్పడం గమనార్హం. ఏపీ జనాలు వైసీపీ మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని వారు ఏపీలో వైసీపీని దించడానికి చూస్తున్నారని రఘురామ తనదైన సర్వేను ఆవిష్కరించారు. అంతే కాదు ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కూడా జనాలు ఈసారి వైసీపీకి ఓటేయరని అది తమ సొమ్ము అని తాము పన్నులతో కట్టిన డబ్బులనే తిరిగి ఇస్తున్నారు అని జనాలు తెలుసుకున్నారని ఆయన విశ్లేషిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని వ్యవస్థలను పూర్తిగా విద్వంశం చేయడం అభివృద్ధి లేకపోవడం ప్రతిపక్షాలను హింసించడం వంటి అనేక కారణాలతో పాటు ప్రజల మీద ఎన్నో భారాలు వేశారని అన్నారు. విద్యుత్ పన్నులతో పాటు నిత్యావసర ధరలు పెంచారని ఏపీలో పెట్రోల్ వంటి వాటి మీద పన్నులు ఎక్కువ చేశారని ఇదంతా సామాన్య మధ్యతరగతి వర్గాలు వైసీపీ మీద తిరుగుబాటు చేయడానికి కారణాలు అని ఆయన అన్నారు.

ఏపీలో రాజకీయంగా ఈసారి వైసీపీకి చుక్కలు చూపించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని రాజు గారు అంటున్నారు. ఇదిలా ఉంటే రఘురామ మరింత ఆసక్తిని గొలిపే విషయాలను కూడా ప్రస్థావించారు. వైసీపీ తానుగా చేయించుకున్న సర్వేలలో కూడా ఈసారి నలభై సీట్లు మాత్రమే వస్తాయని తేలిందని చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీకి ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్తో పాటు క్రిష్ణా ఉత్తరాంధ్రా జిల్లాలలో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని రాజు గారు పేర్కొన్నారు. ఆఖరుకు ప్రశాంత్ కిశోర్ కూడా మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదు అని తేల్చేశారు అని రాజు గారు చెప్పడం విశేషం. ఇక వచ్చే ఎన్నికల్లో సగం మంది సిట్టింగులకు టికెట్ ఇవ్వను అని జగన్ అంటే అది ప్రతిపక్షలా నెత్తిన పాలు పోసినట్లే అని రాజు చెప్పుకొచ్చారు. జగన్ ఈ మధ్య తీసుకున్న అనేక నిర్ణయాలు అన్నీ కూడా విపక్షానికి కలసివచ్చేవే అని ఆయన పేర్కొన్నరు. అదే విధంగా వైసీపీ డబ్బులిచ్చి గెలవాలని చూస్తోందని కానీ ఆ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని జనాలు విపక్షానికి ఓటు వేస్తారని ఆయన చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement