Friday, May 3, 2024

వ్యాక్సిన్ అంద‌రికి అవ‌స‌రం..అపోహ‌లు వ‌ద్దు –కలెక్టర్ శశాంక్..

వ్యాక్సిన్ వేయించుకునే విష‌యంలో ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా.. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ ను తప్పక వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మండలంలోని కంబాలపల్లి గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్నేషన్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేయాలన్నారు . అంతేకాకుండా గ్రామపంచాయతీ కార్యదర్శిలతో ఇంటింటి సర్వే చేపట్టాలని మండల పంచాయతీ అధికారిని ఆదేశించారు.ఎంపీడీవోల వద్ద ఓటరు జాబితా పాటుగా, రేషన్ డీలర్ల వద్ద లబ్ధిదారుల వివరాలు, డిఆర్డిఏ అధికారుల వద్ద పెన్షనర్ల వివరాలు, ఐసిడిఎస్ అధికారుల వద్ద గర్భిణీ స్త్రీల వివరాలను సేకరించి, వాస్తవ నివేదిక రూపొందించి.. ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సినేషన్ వేయించుకున్నవారు, వేయించుకోని వారు, మృతిచెందిన వారు, వలస వెళ్లిన వారిని గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

అంతేకాకుండా రెండో డోస్ ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో, ఎంతమంది ఉన్నారో తెలుసుకోని, మొదటి డోస్ వేసుకున్న తేదీ ప్రకారంగా రెండవ డోసు కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.హస్పటల్ ఆవరణలో పరిశుభ్రతను పరిశీలిస్తూ దట్టమైన చెట్లను సరి చేయించాలని, చెత్తాచెదారం తొలగించి,పరిశుభ్ర పరచాలని ఎంపీడీవో ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, ఉప వైద్యాధికారి అంబరీష, ఎంపిడిఓ రవీందర్, వైద్యాధికారి సుధీర్, ఎంపిఓ హరి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement