Friday, January 21, 2022

ఇంట గెలువనోడు రచ్చ గెలుస్తాడా?: కేసీఆర్ కు షర్మిల సూటి ప్రశ్న

దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిన్న కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఎం నేతలతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయిన ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీని ఏలడానికి మీటింగ్లు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది కానీ రాష్ట్రంలో రైతు చావులను పట్టించుకోవడానికి సమయం లేదు దొర గారికి అంటూ మండిపడ్డారు. ఇంట గెలువనోడు రచ్చ గెలుస్తాడా? అని ప్రశ్నించారు. మీరు ఇక్కడి రైతులనే ఆదుకోనప్పుడు, రైతుల పాలిట రాక్షస పాలన చేస్తున్న ఈ రైతు ద్రోహి ప్రభుత్వానికి దేశం పట్టం కడుతుందా ? అని మండిపడ్డారు. రైతుబంధు ఇచ్చి రైతులకు ఉపాధి చూపుతున్నాం అన్న దొరగారి గప్పాలు నిజమైతే మొన్న ఇద్దరు, నిన్న నలుగురు, ఇవాళ ఒక్కరు… పెట్టిన పెట్టుబడి రాక, అప్పుల బాధతో పంట నష్టపోయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటారు ? అని నిలదీశారు. రైతు ఆత్మహత్యలను ఆపడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అని షర్మిల ధ్వజమెత్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News