Thursday, April 18, 2024

క‌రోనా ఎఫెక్ట్ – క‌ర్ణాట‌క‌-తెలంగాణ స‌రిహ‌ద్దులో చెక్ పోస్ట్

క‌రోనా కేసులు భారీగా పెరుగుతోన్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. ప‌లు రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూ విధిస్తుంటే, మ‌రికొన్ని లాకౌడౌన్ దిశ‌గా వెళుతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా చ‌ర్య‌లు చేప‌ట్టింది. క‌ర్ణాట‌క‌, తెలంగాణ స‌రిహ‌ద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. దాంతో సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం హస్సెల్లి గ్రామంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే, జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి గ్రామ శివారులో కూడా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. సరిహద్దు దాటుతున్న వ్యక్తులకు క‌రోనా టెస్ట్ లు నిర్వ‌హించేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామ‌ని అధికారులు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల వ‌ద్ద 24 గంట‌ల పాటు పోలీసులు అందుబాటులో ఉండ‌నున్నారు.

జహీరాబాద్ బీదర్ రోడ్డుపై రాష్ట్ర సరిహద్దులో ఉన్న గణేష్‌పూర్ శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారికిCovid-19 ప‌రీక్ష‌లు సైతం నిర్వ‌హిస్తున్నారు. పోలీసుల‌తో పాటు వైద్య సిబ్బంది బృందం అయా చెక్ పోస్టుల వ‌ద్ద 24 గంట‌లు అందుబాటులో ఉంటార‌ని స‌మాచారం. పాజిటివ్ ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వ‌డం లేదు. క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రిపోర్టు వ‌స్తేనే రాష్ట్రంలోకి వారిని అనుమ‌తిస్తున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో Corona నెగ‌టివ్ వ‌చ్చిన వారు మాస్కులు ధ‌రించ‌డం, ఇత‌ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌డం వంటి వాటిని కూడా అధికారులు ప‌రిశీలిస్తున్నారు.సంగారెడ్డి జిల్లా అధికారులు మీర్జాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్నవారికి స్క్రీన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు కఠిన నిబంధనలు అమలు చేస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement