Tuesday, May 7, 2024

Siddipet: యోగ ఆనంద దాయకం… మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట ప్రతినిధి: యోగ ఆనంద దాయకమని, యోగ చేస్తే రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పట్టణ 22వ వార్డులో ఉచిత ఆనంద యోగ క్యాంపులో మంత్రి హరీశ్ రావు హాజరై యోగ సాధకులకు మ్యాట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… క్రమపద్ధతిలో చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుందన్నారు. సహజ సిద్ధమైన, అద్భుతమైన ఔషధం యోగ అని హరీశ్ రావు చెప్పారు. తమ ప్రయత్నం ఆరోగ్య సిద్ధిపేట సాధన యోగాతో సాధ్యమైంతుందన్నారు. నిరంతరం ఈ యోగ ప్రక్రియ కొనసాగించాలన్నారు. ప్రపంచంలోని అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే యోగను అనుసరిస్తున్నాయన్నారు. మీ జీవన విధానంలో యోగ ఒక భాగంగా చేసుకోవాలన్నారు. మీ పిల్లలకు సైతం యోగ నేర్పించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కోరారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపాలిటీ 22వ వార్డు శ్రీ చైతన్య స్కూల్ లో యోగ శిక్షకులు తోట సతీశ్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా కొనసాగుతున్న ఉచిత ఆనంద యోగ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న 100 మంది సాధకులకు మ్యాట్ లు పంపిణీ చేశామన్నారు. మితమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలని, యోగ, ప్రాణాయామం వల్ల కలిగే ఆరోగ్య సూత్రాలు చెప్పారు. నిత్యం క్యాంపు కార్యాలయంలో యోగ శిక్షణా తరగతులు జరుగుతున్నాయని, అలాగే పట్టణంలోని వార్డు వారీగా 10 రోజులు ఉచిత యోగ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. రేపట్నుంచి రైస్ మిల్లు అసోసియేషన్ లో ఆనంద యోగ ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

ఈ మేరకు యోగ సాధనతో ఏం మార్పులు వచ్చాయని, అనుభవాల గురించి ఒక్కొక్కరితో మాట్లాడారు. ఆనంద యోగ ఉచిత క్యాంపుతో రోజంతా ఆనంద దాయకంగా ఉన్నదని యోగ సాధన చేస్తున్న గృహిణి తెలిపింది. పదేళ్ల నుంచి నెక్ పెయిన్ తో బాధపడుతున్నానని, 15 రోజులుగా చేస్తున్న యోగాతో తగ్గిందని ఉపాధ్యాయురాలు సరిత చెప్పింది. మరో యోగ సాధకురాలు 2015లో బస్సులో నుంచి పడ్డట్లు, అప్పట్నుంచి నొప్పితో బాధ పడినట్లు ఈ యోగ సాధనతో రిలీఫ్ గా మారి ఆనందంగా ఉన్నదని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement