Monday, May 6, 2024

Andhra Pradesh గోదావ‌రి గ‌ల గ‌ల – రాయ‌ల‌సీమ విల‌విల ..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రం లో వర్షాకాల సీజన్‌ ప్రారంభమై దాదాపుగా నెల రోజులు దాటిపోయింది. ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ లోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగం టుతున్నాయి. ఇదే సందర్భంలో ఎగువ రాష్ట్రా ల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్న గోదావరి నది పొంగి ప్రవహిస్తోం ది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ సోమశిల వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో సాధారణ నిల్వలే దర్శనమి స్తుండగా, పోలవరం ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోం ది. రోజుకు 6 నుండి 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నది నుండి సముద్రంలో కలుస్తోం ది. ఇదే సందర్భంలో రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు కోస్తాఆంధ్రలోని మూడు జిల్లా ల్లో వ్యవసాయ పంటలు సాగుకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్‌లో పునరా వృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో అధికారంలో ఉన్న ప్రభు త్వాలు నదుల అనుసంధా నంవైపు దృష్టి సారిం చాయి. వర్షాకాల ఆరంభంలోనే రికార్డు స్థాయి లో పొంగి ప్రవహించే గోదావరి జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతా లకు పూర్తి సమయం పుష్కలంగా నీరందిం చొచ్చని యోచిస్తున్నాయి.

ఆ దిశగానే గోదావరి, కృష్ణా నదుల అనుసంధా నానికి ప్రతిపాదనలు కూడా రూపొందించాయి. స్వర్గీయ ముఖ్యమం త్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి హయాం నుండి నేటి సీఎం జగన్‌ వైయస్‌ జగన్‌ వరకూ అనుసంధానం వైపు ప్రత్యేక దృష్టి సారిస్తూన్నా వివిధ వివాదాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి సంఘం నదుల అనుసంధాన ప్రక్రియను పరిశీలనకే పరిమితం చెెస్తోంది. ప్రస్తుతం కేంద్ర పరిధిలో ఉన్న నదుల అనుసంధానానికి సంబం ధించిన ప్రతిపాదనను పరిశీలించి ఆమోదం తెలిపితే రాష్ట్రవ్యాప్తంగా సాగు నీటి సమస్య పరిష్కారం కావడంతోపాటు వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. గత దశాబ్దకాలంగా గోదావరి, కృష్ణా అనుసంధాన ప్రక్రియ ప్రకటన లకు, ప్రచారానికే పరిమితమవు తోంది. ఫలితం గా ప్రతి ఏటా గోదావరి నుండి వందలాది టీఎంసీ ల నీరు సముద్రం పాలవుతోంది.


గోదావరి-కృష్ణా అనుసంధాన విధానం
పోలవరం ప్రాజెక్టు నుండి గోదావరి జలాల ను పోలవరం ప్రాజెక్టు తరలించి, అక్కడ నుండి పోలవరం కుడి కాలువ ద్వారా పులిచింతలకు తరలిస్తారు. అక్కడ నుండి నాగార్జునసాగర్‌ కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి గోదావరిని కలుపు తారు. ఈ ప్రక్రియ ద్వారా శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి వచ్చే వరదలో దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేయడం కంటే ఆ నీటిని శ్రీశై లం ప్రధాన కాలువ ద్వారా రాయలసీమ ప్రాంతా ల్లోని వివిధ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో మళ్లించ నున్నారు. ఈ ప్రక్రియ ద్వారా గోదావరి జలాలు వృథాగా సముద్రంపాలు కాకుండా అడ్డు కట్ట వేయడంతోపాటు ఎగువ నుండి వస్తున్న కృష్ణా జలాలు శ్రీశైలంలో భారీగా నిల్వచేసి, ఆ తరువాత వచ్చిన నీటిని వచ్చినట్లుగా పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు తరలించి అక్కడి నుండి సోమశిల, కండలేరు జలాశయాలకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలి. అదే సంద ర్భంలో రాయల సీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మరికొన్ని ప్రాజెక్టులకు కృష్ణా నీటిని మళ్లించనున్నారు. ఇది గతంలో ప్రతిపా దించిన అనుసంధాన ప్రక్రియ. ఇదే సందర్భంలో తాజాగా మరో ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చింది. గోదావరి జలాలను పోలవరం నుండి పులిచింతలకు తరలించి అక్కడి నుండి ఇచ్చం


పల్లి ప్రాజెక్టుకు పంపి ఆ తరువాత నాగార్జున సాగర్‌ మీదుగా పైపు లైన్లు ఏర్పాటుచేసి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీ వద్ద ఆలైన్‌ను అనుసంధానం చేయాలని ప్రతిపా దించారు. దీనికి సంబంధించిన 2 రకాల ప్రతిపా దనలు కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నా యి. అందుకోసం ప్రాథమికంగా రూ. 15 వేల కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా వేశారు. సుమారు 850 కీమీకి పైగా కాలువలు, పైపులైన్లను ఏర్పాటుచేసే ప్రక్రియలో భాగంగా ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను కూడా నిర్మించాల్సిన అవసరం ఉంటుందని, అందుకోసం అదనపు వ్యయం వెచ్చించాల్సి వస్తుందని కూడా ప్రతిపాదనలో సూచించారు.


ఒక్క సీజన్‌లోనే 500 నుండి వెయ్యి టీఎంసీలకుపైగా సముద్రంపాలు
అన్నపూర్ణ రాష్ట్రంగా పేరుగాంచిన ఆంధ్ర ప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి, పెన్నా నదులపై పలు భారీ ప్రాజెక్టులను నిర్మించారు. వాటి పరిధిలో ప్రధాన కాలువలు, బ్రాంచి కెనాల్స్‌ ఉన్నాయి. ప్రతి ఏటా వర్షాకాల సీజన్‌లో ఆయా నదుల పరిధిలో నిర్మించిన ప్రాజెక్టులకు భారీ వరదలు రావడం, దిగువకు (సముద్రానికి) వందలాది టీఎంసీల నీటిని వృథాగా వదిలేయడం జరుగు తుంది. అయితే, కృష్ణా నదితో పోలిస్తే గోదావరి జలాలు సీజన్‌ ఆరంభం నుండి ముగిసే వరకూ సుమారు 5 నెలల కాలంలో 500 నుండి వెయ్యి టీఎంసీల నీరు వరకూ వృథాగా సముద్రంలో కలుస్తుంది. ఒక్కో సీజన్‌లో గోదావరికి భారీగా వరద వచ్చినా రాష్ట్రంలోని కృష్ణా నది పరిధిలో ఉన్న ప్రాజెక్టుల్లో మాత్రం నీరు అడుగంటే ఉంటు న్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గోదావరి జలాలను ఒడిసి పట్టుకుని రాయలసీమ జిల్లాలకు తరలిస్తే సాగు నీటి సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుందని ప్రభుత్వాలు యోచి స్తున్నాయి.

- Advertisement -

ఆదిశగానే ఎప్పటికప్పుడు నదుల అనుసంధాన ప్రక్రియను కేంద్రం దృష్టికి తీసుకె ళ్తూనే ఉన్నాయి. తాజాగా ప్రస్తుత వర్షాకాల సీజన్‌ ప్రారంభమై నాలుగు వారాలు పూర్తి కాకముందే గోదావరికి 9 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు వచ్చి చేరుతుంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది..గోదావరి జిల్లాల పరిధిలోని కాటన్‌ బ్యారేజీకి వరద పోటెత్తడంతో గేట్లన్నిం టినీ ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నా రు. దీంతో రోజుకు 6 లక్షల క్యూసెక్కుల నుండి 9 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలసిపో తోంది. ఇలా ఒక్క సీజన్‌లోని వందలాది క్యూసె క్కుల నీరు సముద్రం పాలవుతోంది. ఒక్క టీఎంసీ నీటి తో 12వేల ఎకరాలనుండి 15 వేల ఎకరాల వరకూ సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. రాయల సీమ లాంటి కరువు జిల్లాల్లో చుక్క నీరు లేక అనేక సందర్భాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంట లు కళ్లముందే ఎండి పోతున్నా రైతులు ఏం చేయ లేక నిస్సహాయుల వుతున్నారు. అనేక సందర్బా éల్లో ప్రభుత్వాలు పంటలను కాపాడేందుకు రెయి న్‌ గన్‌లు ఉపయోగిస్తున్నాయి. రాయలసీమ రైతులకు ఇటువంటి పరిస్థితులు భవిష్యత్‌లో పు నరావృ తం కాకుండా ఉండాలంటే గోదారిని కరువు సీమ అయిన రాయల సీమకు తరలించే నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement