Sunday, May 5, 2024

Big Breaking: తెలంగాణకు ఎల్లో అలర్ట్​.. ఉరుములు, మెరుపులతో వర్షాలుంటయ్​!

కాస్త నెమ్మదించిన వరుణుడి మళ్లీ ప్రతాపం చూపుతున్నాడు. ఇవ్వాల (సోమవారం) సాయంత్రం హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చిరుజల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీగా వాన పడుతున్నట్టు సమాచారం అందుతోంది.

హైదరాబాద్​లోని కూకట్‌పల్లి, హైదర్​నగర్​, మూసాపేట, అల్విన్​ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, కాప్రా, ఏఎస్​రావు నగర్​, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్​లో వర్షం పడుతోంది. వాన రావడంతో వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. వర్షానికి సంబంధించి జీహెచ్​ఎంసీ అధికారులు స్మార్ట్​ఫోన్లకు మెస్సేజ్​ ద్వారా అలర్ట్​ చేశారు.

కాగా, తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలుంటాయని హెచ్చరికలు జారీ చేసింది. మెదక్​, రంగారెడ్డి, మేడ్చల్​ సంగారెడ్డి జిల్లాలకు రేపు ఉదయం వరకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement