Tuesday, May 21, 2024

Woman Rash Driving – ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం…

హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారుతో సోమవారం ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఓవర్ స్పీడ్ తో వెళ్లిన కారు చెట్టు, ఎలక్ట్రికల్ పోల్, గోడని ఢీ కొట్టింది. ప్రమాదం ధాటికి కారు రెండు టైర్లు విడిపోయి కొంత దూరంలో పడ్డాయి.అయితే, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో కారులోని మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. కారును అక్కడే వదిలేసి తన హై హీల్స్ భుజాన వేసుకుని అక్కడి యువతి వెళ్ళిపోయారు.

కాగా, ప్రమాద స్థలంలో గుడిసెలో ఒక వాచ్ మెన్ ఫ్యామిలీ ఉంది. గుడిసెకి అడుగుదూరంలో కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు

Advertisement

తాజా వార్తలు

Advertisement