Tuesday, May 7, 2024

టిఆర్ఎస్ ను తిరుగులేని రాజకీయశక్తిగా తీర్చిదిద్దుతా: కోరుకంటి

గోదావరిఖని (ప్రభా న్యూస్) పెద్దపల్లి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని తిరుగులేని రాజకీయశక్తిగా తీర్చిదిద్దుతానని తెరాస జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు . బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేక‌రుల నమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రామగుండం నియోజవర్గం నుండి ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశామని, వందలాది కేనులను జైలు జీవితం గడిపామని తెలిపారు.

పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవి ఉద్యమ నాయకుడినైన తనకు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులపై తనుకున్న అభిమానాన్ని మరోమారు చాటారన్నారు. పెద్దపల్లి జిల్లా లో టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాబోవు కాలంలో జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలను టిఆర్ఎస్ పార్టీ గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమతిగా అందిస్తామన్నారు కోరుకంటి. టిఆర్ఎస్ పార్టీ అభ్యున్నతికి మరింతగా పాటుపడుతానని, ప్రజలకు, ప్రభుత్వానికి గులాబీ సైనిలకుంతా వారధులుగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement