Monday, May 6, 2024

Delhi | వైఎస్ఆర్ లేని కాంగ్రెస్ ఎక్కడిది? : నీలం రమేష్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కొన్ని కోట్ల గుండెల్ని గెలిచిన వైఎస్ఆర్ ను, కాంగ్రెస్ పార్టీ మరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి, కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ నీలం రమేష్. తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఏ కాంగ్రెస్ లీడర్ అయినా తిరుగుతున్నారు అంటే, అది కేవలం రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ధైర్యమే అని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ఆర్ పేరు చెబితే… ప్రజలకు ఎక్కడ ఆయన తనయ షర్మిల గుర్తుకు వస్తుందోనన్న భయంతోనే… కనీసం రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించడం లేదని రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో పదేపదే వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని చూపించి, ఓట్లు అడుక్కుంటున్న ఈ రేవంత్, షబ్బీర్ అలీలకు కనీసం ఆయన పేరును తలుచుకోవాలన్న సోయ కూడా లేదా అని ప్రశ్నించారు.

తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి, ఓట్లు దండుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలకు సిగ్గు, శరం ఉంటే… ముందు వైఎస్ఆర్ కుంటుంబ సభ్యులను తలుచుకోవలని హితవు పలికారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు కేవలం పేపర్లకే పరిమితమని… అదే వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చిరస్మరణీయమని పునరుద్ఘాటించారు.

- Advertisement -

ప్రతి అవ్వ, తాత నవ్వులో ఆరోగ్యశ్రీ ఉందన్న నీలం రమేష్, కొన్ని లక్షల ప్రాణాలను కాపాడిన 108, ఇవాళ వేల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న యువతకు ఫీజు రీయంబర్స్మెంట్ యాదికి ఉందని తెలిపారు. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రభంజనం ఖాయమన్న నీలం రమేష్, కామారెడ్డిలో షబ్బీర్ అలీకి ఓటమి రుచి చూపిస్తానని సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement