Monday, April 29, 2024

ముత్యాల దారా జలపాత అడవిలో చిక్కుకున్న సందర్శకులను కాపాడుతాం – ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం

.

ములుగు :ముత్యాల దారా జలపాతం వీక్షించడానికి వెళ్లిన సందర్శకులు దారితప్పి అడవిలో చిక్కుకున్న విషయం జిల్లా ఎస్పీ గౌస్ ఆలం దృష్టికి రాగ జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి పంపినట్లు అయన వెల్లడించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడి తీరుతామని ఎస్పీ తెలిపారు.

చిక్కుకుపోయిన పర్యాటకులతో మాట్లాడిన ఎస్పీ వాగు దాటేందుకు ఎట్టి పరిస్తుతులలో ప్రయత్నించవద్దని రెస్క్యూ బృందాలు హుటాహుటిన తమ వద్దకు చేరుకుంటారని అప్పటివరకు వారు ఎత్తైన ప్రదేశంలో ఉండాలని మరియు వారి మొబైల్ బ్యాటరీ భద్రపరచు కోవాలని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లో దిగులు చెందవద్దని మనోధైర్యంతో ఉండాలని ఆహార పదార్థాలు,ఇతర రెస్క్యూ పరికరాలు తమ వద్దకు పంపించినట్లు, అప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా ఉండాలని కోరారు.ఘటనపై ఎస్పీ గౌస్ ఆలం అధికారులను అప్రమత్తం చేసి వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement