Tuesday, April 30, 2024

ఈ సీఎం మాకొద్దు… ఆరునూరైన కేసీఆర్ ను ఓడించితీరుతాం – ఈటల రాజేందర్

మెదక్ ప్రతినిధి:ప్రభ న్యూస్. – తెలంగాణ యువకులు ,విద్యార్థులు ఈ సీఎం మాకొద్దు అని, ఆరునూరైన సీఎం కేసీఆర్ ను ఓడించి తీరుతామని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.సోమవారం రాత్రి మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సమావేశానికి ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో సదువుకుంటే నౌకర్లు రావని..పైరవిలకే ఉద్యోగాలు వస్తాయని టీఎస్పిఎస్సి లో అక్రమాలు నిరూపించాయన్నారు. హుజురాబాద్ ఫలితమే రేపు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం అవుతాయని ఆయన స్పష్టం చేశారు.సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడంలేదన్నారు.


ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించిననడు జిల్లా గర్వ పడ్డది కానీ నేడు ఛీ అనే రోజులువచ్చాయన్నారు. అదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఈ ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పోలిక లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ను మట్టిలో కలిపేస్తామన్నారు.vతెలంగాణ లో ఈ మూడేండ్ల లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిచిందని స్పష్టం చేశారు. దుబ్బాక,హుజురాబాద్ లలో కాంగ్రెస్ కు డిపాజిట్ పోయిందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీని,జిత్తుల మారి కేసీఆర్ ను ఇంటికిపంపే సత్తా బీజేపీకే ఉందన్నారు.తెలంగాణ లో రబీ లో నోటీకాడి పంట వానలకు నేలపాలు ఆయింది. పదివేలు ఇస్తానని ఐదు పైసలు ఇవ్వలేదు.పంజాబ్,మహారాష్ట్ర రైతులకు తెలంగాణ డబ్బులు ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ కౌలు రైతులు చనిపోతే రూ 5 లక్షలు ఇచ్చే దమ్ముoదా అని ప్రశ్నించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులు చనిపోతే రూ 5 లక్షలు ఇస్తామన్నారు.ధాన్యం కొనలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.


ఎకరాకు రూ ఐదు వేల రూపాయలు ఇచ్చి ధాన్యం అమ్ముకుంటే కటింగ్ పేరుతో ఒక్కొక్కరికి రూ 5 వేలు తీసుకున్నారని విమర్శించారు
మ్యానిఫెస్టో లో పెట్టిన రూ లక్ష రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ నిరుద్యోగుల్లారా కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. టిఎస్పిఎస్సి లో ప్రభుత్వ పెద్దల అండదండలతో పేపర్లు లీకేజీ అయిందని విచారణలో తెలినా చర్యలు తీసుకోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 200 మంది చొప్పున బెల్టుషాపులు ఉన్నాయన్నారు. లిక్కర్ ద్వారా రూ 45 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.సంక్షేమ పథకాలన్నీటికీ ఇస్తే రూ 25 వేల కోట్లు కావన్నారుపేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని మోసం చేసిందని విమర్శించారు.మోడీ సర్కార్ దేశంలో మూడున్నర కోట్ల ఇండ్లు కట్టించిందన్నారు.హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రూ 600 కోట్లు ఖర్చు చేసిండ్రు ఏమైంది..పైసలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.


తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట దావత్ లు చేశారని విమర్శించారు.ప్రజా క్షేత్రంలో కేసీఆర్ అంతు చూస్తాం, కేసీఆర్ సర్కార్ పై కొట్లాడతానికి అంకుటిత దీక్ష తో బీజేపీ సిద్ధంగా ఉంది అని అన్నారు

- Advertisement -

.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలజపూర్ శ్రీనివాస్ ,జిల్లా ఇంఛార్జి మల్లారెడ్డి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ ,జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం పరిణిత ,తాళ్లపల్లి రాజశేఖర్ ,నందు జనార్దన్ రెడ్డి రాష్ట్ర నాయకులు రఘువీరా రెడ్డి,మురళీ యాదవ్,వాలిదాస్ మల్లేష్, జిల్లా అధికార ప్రతినిధులు నందా రెడ్డి,శ్రీనివాస్,మహిళా మోర్చా అధ్యక్షురాలు వీణ, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కలదేవి మధు,పట్టణ బీజేపీ అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement