Monday, May 6, 2024

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నాడని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పరకాల మండలం కామారెడ్డిపల్లె, నాగారం గ్రామాల్లో, పరకాల పట్టణంలోని రైతు వేదికలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రైతులు, పార్టీ కార్యకర్తలతో నిరసన కార్యక్రమం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతును రాజు చెయ్యాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టి అభివృధ్ధికి కృషి చేస్తుంటే, రైతుల పట్ల, రైతు సంక్షేమ పథకాల పట్ల టిపీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ద్వేషంతో మాట్లాడడం అత్యంత హేయమైన చర్యని మండిపడ్డారు.

రైతుల సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నాడన్నారు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వివక్ష చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రాబోయే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రైతులను కష్టాలపాలు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ హయాంలో ఆకలి గోసలు, రైతు ఆత్మహత్యలు, ఉపాధి వలసలు ఉండేవన్నారు. నేడు సీఎం కేసీఆర్ పాలనలో వలసలు వెళ్లిన వారు వాపస్ వచ్చారు, విద్యావంతులు కూడా వ్యవసాయం చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతుబందు సమితి సభ్యులు, మార్కెట్, సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement