Saturday, April 27, 2024

WGL: వీధి కుక్కల దాడిలో.. ఇద్దరికి తీవ్ర గాయాలు

టేకుమట్ల, సెప్టెంబర్ 12 (ప్రభ న్యూస్) : వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామంలో చిన్నయ్య, నేరేళ్ల కొమురయ్యలపై మంగళవారం వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో వారు గాయపడ్డారని స్థానికులు తెలిపారు.

వీధి కుక్కల వలన ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement