Sunday, May 5, 2024

పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం!

మమనలో చాలామంది ఎన్నెన్నో సాధించాలని ప్రణాళికలు వేసుకుంటారు. తమ గురించి తెలిసేలా ప్రచారం చేసుకోవడం ప్రారంభిస్తారు. అదే ఉత్సాహం వారిలో మరికొన్ని రోజుల తరువాత కన బడదు. ఏదో కారణాన్ని చూపించి పనుల్ని వాయిదా వేస్తారు. లేదంటే ఆపేస్తారు. మధ్యలోనే వదిలేయకుండా చివరి వరకు తొలి ఉత్సాహాన్ని కొనసాగించి అనుకున్న లక్ష్యం చేరేవరకు ప్రయత్నం చేయడమే పట్టుదల.
పట్టుదల, సహనం, పవిత్రత మానవ జీవితానికి ప్రధాన సూత్రాలు. వీటిని చిత్తశుద్ధితో ఆచరించేవాళ్లు నిజ జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని, సమస్యలని సులువుగా ఎదుర్కోగలుగుతారు. ఊహంచని ఓటమి ఎదురైనప్ప టికీ భయపడకుండా ఆత్మనిబ్బరాన్ని ప్రదర్శిస్తూ మనో నిగ్రహంతో నిలబడగలుగుతారు. తమలోని అంతర్గత శక్తులకు పదునుపెట్టి తలపెట్టిన కార్యాన్ని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. చరిత్రలో నిలిచిపోతారు.
సీతమ్మ జాడ కనిపెట్టడమనే బాధ్యతను భుజస్కం ధాల మీద వేసుకున్న హనుమంతుడు నూరు యోజనా ల దూరమున్న సముద్రాన్ని దాటాడు. మార్గమధ్యంలో వచ్చిన ఆటంకాలను తెలివిగా అధిగమించాడు. లంకా నగరంలో అణువణువూ గాలించి శోక వదనంతో కూర్చు న్న సీతమ్మ జాడను అశోకవనంలో కనిపెట్టాడు. శ్రీరాము డిచ్చిన అంగుళీయకాన్ని ఆమెకు చూపించి చెప్పలేనంత ఊరట కల్గించాడు. అంతేకాదు స్పృహ తప్పిన లక్ష్మణు డిని సజీవుడిని చేయడంకోసం సంజీవని కొరకు హమాలయాలకు వెళ్ళాడు. మూలికను గుర్తుపట్టడం లో పొరపాటు జరిగితే ఎదురయ్యే అనర్ధాలను ఊహం చి ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించి మోసుకెళ్ళా డు. మరెన్నో సందర్భాలలో కూడా ఆంజనేయుని కార్య దక్షత, పట్టుదల తెలిపే సన్నివేశాలు కనిపిస్తాయి.
భారతంలో ఏకలవ్యుడి పాత్ర కూడా పట్టుదలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. విలు విద్య నేర్చుకోవాలన్న తపనతో ద్రోణాచార్యుడిని అర్ధించిగా నిషాద కులస్తుడ న్న నెపంతో ఏకలవ్యుడిని తిరస్కరించాడు. అంతటితో ఆగిపోలేదు ఏకలవ్యుడు. ద్రోణుడినే గురువుగా భావించి ఆయన విగ్రహాన్ని ముందు పెట్టుకుని కఠోర సాధన చేసా డు. మేటి విలుకాడిగా ప్రావీణ్యత పొంది, తనని తిరస్క రించిన గురువు చేతనే శభాష్‌ అనిపించుకున్నాడు.
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నట్టు నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా ప్రయత్నిస్తే విజయలక్ష్మి వరిస్తుంది. మధ్యలోనే లక్ష్యం నుండి వైదొలగితే పరాజితులుగా మిగిలిపోతారు. విజేతలను గుర్తు పెట్టుకున్నంతగా పరా జితులను గుర్తుంచుకోదు లోకం.
బాల్య వివాహాలతో, భర్తలను కోల్పోయి దుర్భరమై న జీవితాలను గడిపిన కాలంలో స్త్రీ విద్య, వితంతు వివా హాల కోసం పోరాటం సాగించారు కందుకూరి వీరేశలిం గం పంతులు. మహళల పాలిట శాపంగా మారి ఎందరి నో బలిగొన్న సతీ సహగమన దురాచారాన్ని రూపుమాప డానికి కృషి చేసారు రాజారామ్‌మోహన్‌రాయ్‌. కన్యా శుల్కం, వరకట్న దురాచారాలను రూపుమాపడానికి కృషి చేసారు మరెందరో మహానుభావులు. వాళ్ళు కూ డా లక్ష్యాలను సులువుగా సాధించలేదు. అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు. అభ్యుదయ మార్గం నుండి వారిని తప్పించాలని ప్రయత్నించిన సాంప్రదా య వాదులెందరినో సహనంతో సానుకూలపరచుకు న్నారు. వారిలోని అకుంఠిత దీక్ష, పట్టుదల దేనికీ భయ పడని మనస్తత్వం వారిని వెనకడుగు వేయనీయక లక్ష్యం వైపు నడిపించాయి. తరువాతనే సమాజంలో మార్పు సాధ్యమైంది. స్త్రీల నుదుట చిరునవ్వుల గౌరవ తిలకా న్నద్ది, సమానత్వపు బాటలో పురుషుల సరసన నిలప డంలో నాటి సంఘ సంస్కర్తల పట్టుదల ప్రధాన పాత్ర.
కొన్నేళ్ల క్రితం వరకు కొందరికే పరిమితమైన గ్రాం థిక భాషను నిరసించి, అందరికీ సులభంగా అర్ధమయ్యే లా వ్యవహారిక భాష అవసరాన్ని చాటి చెప్పారు గిడుగు. ఆ ప్రయత్నంలో ఆయన ఆరోగ్యం క్షీణించినా సరే లెక్క చేయక ఎన్నో శ్రమలకు ఓర్చుకున్నారు. ప్రజలు మాట్లా డుకునే భాషలో ప్రచురణలు రావడానికి కారణమయ్యా రు. మనం చదువుతున్న అక్షరాలన్నీ వాడుకభాషలో ఉన్నాయంటే అదంతా ఆయన చలువే.
గాంధీజీ వంటి మహనీయులకు స్ఫూర్తి కలిగించి న తిలక్‌, ఆంగ్లేయుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన నేతా జీ సుభాష్‌ చంద్రబోస్‌, ఒంటి కాలితో కెనడాలో మార థాన్‌ రన్నింగ్‌ చేసిన టెర్రీఫాక్స్‌, సాహసం చేసి హమాల య పర్వతాలలోని ఎత్తయిన శిఖరం ఎక్కిన టెన్సింగ్‌ నార్కే, ఒలింపిక్‌ క్రీడల్లో వరుస పతకాలు సాధించిన పి.వి.సింధు మొదలైనవారు పట్టుదలకు ప్రతిరూపాలు.
ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అంకుర సంస్థల నేర్పాటు చేసిన ఎందరో టెక్కీలు ఆయా రంగా ల్లో అద్భుత విజయాలను ఒడిసి పట్టుకున్నారు. ఎందరి కో స్ఫూర్తినివ్వడమే కాకుండా మరెందరికో ఆదర్శనీయు లయ్యారు. ఆయా విజయాల వెనుక వారిలోని అకుంఠి త దీక్ష, పట్టుదలే కనిపిస్తాయి. పట్టుదలంటే ఒక సుదీ ర్ఘమైన పరుగు పందెంకాదు. ఒకదాని తరువాత ఒకటి వచ్చే ఎన్నో చిన్నచిన్న పరుగు పందాల సమూహమని గుర్తుంచుకోవాలి. ఏ పని తలపెట్టినా సాధించేవరకు వది లిపెట్టని స్వభావం అలవరచుకున్నప్పుడే కార్యానుకూల త సాధించగలరు. విజయ తీరాలకు చేరుకోగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement