Saturday, May 4, 2024

శబ్ద కాలుష్య నియంత్రకై స్పెషల్ డ్రైవ్..

రణ గొన ధ్వనులతో వరంగల్ మహా నగరంలో శబ్ద కాలుష్యానికి కారణమ‌వుతోన్న ద్విచక్ర వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు విశ్వరూపం చూపారు. ఎన్ని సార్లు హెచ్చరించిన తీరు మార్చుకొని వాహనదారులకు ఊహించని షాక్ నిచ్చారు. స్పెషల్ డ్రైవ్ ను చేపట్టి, అధిక మొత్తంలో సౌండ్ పొల్యూషన్ చేస్తున్న సైలెన్సర్ లను వెహికిల్స్ నుండి తొలగించారు. అనంత‌రం రోడ్డు రోలర్స్ కింద వేసి ధ్వంసం చేశారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఎంతో సహనంతో టూ వీలర్ వెహికిల్స్ ఓనర్లకు చెప్పినా పెడచెవిన పెట్టడంతో సీరియస్ గా తీసుకొన్నారు. రెగ్యులర్ చెకప్స్ సమయంలో సౌండ్ పొల్యూషన్ కలిగిస్తున్న సైలెన్సర్స్ ను తొలగించాలని ఇచ్చిన వార్కింగ్ ని లైట్ గా తీసుకుంటున్నారు. దాంతో ట్రాఫిక్ పోలీసులు డోస్ పెంచారు. హైదరాబాద్ లో పోలీస్ కమీషనర్ ఆచరించిన పద్ధతులు, విధానాలను వరంగల్ లో అమలు పరచి, వాహనదారులకు షాక్ ఇచ్చారు. వరంగల్లోని తెలంగాణ జంక్షన్ వద్ద ఈ నెలలో పట్టుకున్న 30 అధిక మొత్తంలో సౌండ్ పొల్యూషన్ చేస్తున్న సైలెన్సర్ లను రోడ్డు రోలర్ కింద వేసి, ధ్వంసం చేశారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కంపెనీ నుండి వచ్చిన సైలెన్సర్స్ ను తొలగించి, అధిక శబ్దం చేసే సైలెన్సర్స్ ను వెహికిల్స్ కు అమర్చుకొని, నగరంలో సౌండ్ పొల్యూషన్ సృష్టించడమే కాక, ప్రజలకు అసౌకర్యం, ఇబ్బంది కలిగించే వాహనాల భరతం పట్టె సత్కార్యానికి వరంగల్ ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు.

అధిక శ‌బ్ధాలు చేస్తూ, పేషంట్స్ ప్రాణాలతో చేలాగాటమాడటం కూడ నేరంగానే పరిగణిస్తారు. ప్రజల యొక్క స్థితిగతులను అర్థం చేసుకోకుండా హై సౌండ్స్ వచ్చే సైలెన్సర్స్ ఏర్పాటు చేసుకోవడం, కొందరైతే కంపెనీ నుండి వచ్చిన వాహనాల సైలెన్సర్స్ మఫలర్స్ తొలగించి,భీకరమైన శబ్దాలతో నగరంలో హాల్ చల్ చేస్తున్న వాహణదారులపై కొరడా ఝుళిపించారు. సౌండ్ పొల్యూషన్ తో వాతావరణ ,శబ్ద కాలుష్యానికి కారణమవడమే కాక,నగర వాసులు అసౌకర్యం,ఇబ్బందులు గురి చేస్తుండటంతో వరంగల్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా తీసుకొని ,హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అమలు పరిచిన పద్ధతిని వరంగ‌ల్ లో అమలు పరిచారు.

భవిష్యత్తులో శబ్ద కాలుష్యంకు అవకాశం లేకుండా చేయడం కోసమే భారీ శబ్దాలు చేసే సైలెన్సర్స్ ను ధ్వంసం చేసి, షాకిచ్చారు.ఇక నుండి రెగ్యులర్ చెకప్స్ చేస్తూ, సౌండ్ పొల్యూషన్ చేసే వాహనదారుల భరతం పడతామని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ వడ్డే నరేష్ కుమార్ హెచ్చరించారు. మోటార్ వెహికిల్ యాక్ట్ కు లోబడి నడుచుకోవడంతో పాటు ,ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి సహకరించాలని ఆయన కోరారు. నవంబర్ ఫస్ట్ నుండి ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేయబోతున్నట్లు చెప్పారు. చట్టాలు, నిబంధనలు ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేశారని గ్రహించి, విదిగా ఆచరించాలని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ వడ్డే నరేష్ కుమార్ కోరారు. చట్టాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement