Wednesday, May 29, 2024

పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టాలి : MSP నేత మందకుమార్ మాదిగ

హ‌నుమ‌కొండ‌ : ఎస్సీల వర్గీకరణ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదం తెలిపే విధంగా బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలతో మాట్లాడి ఒప్పించాలని MRPS జిల్లా కన్వీనర్ గద్దల సుకుమార్ మాదిగ ఆధ్వర్యంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురలు రావు పద్మకు వినతి పత్రం సమర్పించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MSP ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి మంద కుమార్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా బిజెపి జిల్లా రాష్ట్ర కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1994లో MRPS ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం నుండి నేటి వరకు భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమనే చెబుతున్నది. కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని అన్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు కావస్తున్న వర్గీకరణ విషయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొనే విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శించక పోవడం మాదిగలను ఆవేదనకు గురి చేస్తున్నదని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ డిమాండ్ లేని, ఎలాంటి ఉద్యమాలు లేని అనేక అంశాలు పార్లమెంటులో బిల్లు పెట్టి నెగ్గించుకున్న సందర్భాలు ఈ మధ్యలో చాలా ఉన్నాయి. గత 28 సంవత్సరాలుగా పార్టీ విధానంలో భాగంగానే మద్దతు పలికిన ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎందుకు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారో అర్థం కాని అంశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యనే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సదాశివ కమిషన్ ని ఆమోదిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఢిల్లీకి పంపించడం జరిగింది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు గతంలోనే ఢిల్లీకి పంపడం జరిగింది. ఈ పరిస్థితులలో జాతీయ స్థాయి నాయకత్వాన్ని ఒప్పించి షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించే దిశగా మీ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం తెలిపే విధంగా బీజేపీ పార్టీ చొరవ తీసుకోక పోతే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి మాదిగల నుండి బలమైన నిరసన వస్తుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement