Friday, May 3, 2024

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హన్మకొండ : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్య‌మ‌ని, పల్లె దవాఖాన ద్వారా ప్రజలకు ఆర్ధిక భారం తగ్గుతుంద‌ని ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.16 లక్షలతో పల్లె దవాఖానను ఎమ్మెల్యే చల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ .. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గిపోయిందని, సాధారణంగా గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రైవేట్‌ డాక్టర్లను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఫీజులు, పరీక్షలు, అదే స్థాయిలో మందులు ఇలా దాదాపు వేలల్లో ఖర్చవుతుందని, పల్లె దవాఖానల ద్వారా ఎలాంటి ఫీజు లేకుండా వైద్యులు పరీక్షించి ఉచితంగానే మందులు కూడా అందిస్తుండడంతో పేదలపై ఆర్థిక భారం తగ్గిపోయిందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం లక్ష్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు సారధ్యంలో ప్రభుత్వ దవాఖాన లో ప్రైవేట్ దవాఖానల కంటే మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మండల ప్రజాప్రతినిధులు, మండల తెరాస నాయకులు మరియు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement