Thursday, May 2, 2024

ద‌ర్శ‌కుడు సుజీత్ డైరెక్ష‌న్ లో.. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్

ద‌ర్శ‌కుడు సుజీత్ డైరెక్ష‌న్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ మూవీ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.కాగా అనౌన్స్ మెంట్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. కొన్ని ఫజిల్స్ తో ఎక్కడలేని ఆసక్తి రేపుతోంది. పవన్ ఒక నగరం వైపు తీక్షణంగా చూస్తున్నాడు. రైసింగ్/సెట్టింగ్ సన్ కనిపిస్తుంది. ఆయన నీడను గన్ గా చూపించారు. విదేశీ భాషలో ఏదో రాసి ఉంది. ఇక ‘ఆయన్ని #OG అని పిలుస్తారు’ అని చెప్పి మరింత ఆసక్తి పెంచేశారు. తమిళ హిట్ మూవీ తేరి రీమేక్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే ఇది స్ట్రెయిట్ మూవీలా ఉంది. అలాగే #OG అర్థం ఏమిటని ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు. మొత్తంగా ప్రకటనతోనే ఎక్కడలేని అటెన్షన్ సినిమాకు వచ్చేసింది. పవన్-సుజీత్ కాంబోలో ఒక భారీ బ్లాక్ బస్టర్ ఖాయమనిపిస్తుంది. ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. మరి ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది చెప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement