Friday, April 19, 2024

కాంతార జోరు.. తెలుగులో 50రోజులు కంప్లీట్

క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి న‌టించి ..డైరెక్ష‌న్ చేసిన చిత్రం కాంతారా. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ జోరు కొనసాగిస్తోంది. నటుడు, రచయిత .. దర్శకుడిగా రిషబ్ శెట్టికి పాన్ ఇండియా లెవల్లో మంచి పేరు కూడా వచ్చింది. బాలీవుడ్ నుంచి సౌత్ స్టార్స్ వరకూ అందరిని తన సినిమాతో ఇంప్రెస్ చేశాడు రిషబ్. తెలుగులో ఈ సినిమా 50రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేవారు మూవీ టీమ్. తెలుగులో ఈ సినిమాను గీతాఆర్ట్స్ సంస్థ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసింది. అక్టోబర్ 15వ తేదీన తెలుగులో రిలీజ్ అయిన ఈమూవీ తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచి చాలా రోజుల పాటు అదే వసూళ్ల జోరును కొనసాగించింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.కన్నడలో ఎంత రెస్పాన్స్ వచ్చిందో.. తెలుగులో కూడా అంతే రెస్పాన్స్ ను సాధించింది ఈ సినిమా. తెలుగులో 50 రోజులు పూర్తి చేసుకుంది కాంతార సినిమా. ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతోంది. థియేటర్లలో ఎంత రెస్పాన్స్ సాధించిందో.. అంతకంటే ఎక్కువగా ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement