Tuesday, April 30, 2024

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచింది : ఎమ్మెల్యే చల్లా

వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 17వ డివిజన్ పరిధిలోని ఆదర్శ నగర్ గ్రామంలో రూ.3 కోట్ల 75లక్షలతో పలు అభివృద్ధి పనులకు పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి శంఖుస్థాపన, ప్రారంభోత్స‌వాలు చేశారు. ఎమ్మెల్యేకు డివిజన్ ప్రజలు ఘన స్వాగతం ప‌లికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దాదాపు రూ.4కోట్లతో ఆదర్శనగర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభం చేసుకోవడం జరిగిందన్నారు. రూ.1కోటితో మరికొన్ని పనులు త్వరలోనే ప్రారంభించుకోబుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. దేశంలోనే సీఎం పాలనలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి రాష్ట్ర ప్రజలు,యువత ఆలోచించాలన్నారు. ముందు ముందు మరింత అభివృద్ధిలో దూసుకెళ్లాడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వర్షాకాలం వస్తే చెరువుల తలపించే ఆదర్శనగర్ గ్రామం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇతర డివిజన్లలోని గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.


విలీన గ్రామాల అభివృద్ధి విష‌యంలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక చొర‌వ చూపిస్తున్నార‌ని తెలిపారు.అలాగే ఎన్ని నిధులైన కేటాయించడానికైనా వారు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతాయ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, యువ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement