Monday, May 6, 2024

అర్హులంద‌రికీ ఆస‌రా పింఛ‌న్లు : ఎమ్మెల్యే పెద్ది

ఖానాపూర్ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మంజూరు చేసిన 10 లక్షల నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 12 వేల మందికి ఆసరా పింఛన్లు మంజూరు కాగా.. నేడు ఖానాపూర్ మండలంలోని రంగాపూర్ , కొత్తూరు, రాగంపేట్ గ్రామాలకు చెందిన మొత్తం 621 ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను, ధ్రువ పత్రాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు అందచేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. ప్రభుత్వంచే విడుదలై లబ్ధిదారుల చేతులకు నేరుగా ఆసరా పెన్షన్లను అందించి వారి ఆశీర్వదాన్ని పొందే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మీ అందరి తరుపున నా ధన్యవాదాలు అన్నారు. మొదటిసారిగా రూ.2016, 3016 పెన్షన్ కార్డులను అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసరా పెన్షన్ల మంజూరుకై వయోపరిమితి విషయంలో కేవలం ఓటర్ కార్డును మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంద‌న్నారు. నర్సంపేట నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయలకతీతంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement