Monday, May 6, 2024

నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వచేసిన వారిని టాస్క్ఫోర్స్ పోలీసులు వ‌ల‌ప‌న్ని పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం ఓ కిరాణ షాపులో పోలీసులు తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేధిత అంబర్, జెకె జర్ధా, బ్లాక్ బాబా, స్వాగత్, ఆర్ ఆర్ , వీ-1 ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.24,250/- ఉంటుంద‌న్నారు. దుకాణం నిర్వ‌హిస్తున్న వల్లాల సూర్య ప్రకాష్ ను విచారించగా తాను చక్కిలం రాజగోపాల్ వద్ద నిషేధిత పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేశానని వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేర‌కు అతనిని కూడా అదుపులోకి తీసుకోవడం జ‌రిగింద‌న్నారు. పై ఇద్దరిపై చట్టరీత్య చర్యలు తీసుకోనున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement