Saturday, May 4, 2024

ప్రీతిధి ముమ్మాటికి ఆత్మహత్యే – వరంగల్ సీపీ రంగనాథ్

మెడికల్ విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి పోస్టుమార్టం నివేదిక వచ్చిందని, ఇందులో కీలక విషయాలు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీషీటును దాఖలు చేయనున్నట్లు తెలిపారు. సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి ఆత్మహత్య చేసుకున్నదన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నదన్నారు.  కొద్ది రోజుల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనం కలిగించింది. ఇదిలా ఉంటే ప్రతీ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ కు కోర్టును నిన్ననే బెయిల్ మంజూరు చేసింది. ఇంజక్షన్ ద్వారా పాటిజిన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. సీపీ ప్రకటనపై ప్రీతి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement