Wednesday, May 1, 2024

1000 కి.మీ యాత్ర గుర్తుగా.. ఆదోని టౌన్ వార్డ్ 21 దత్తతకు లోకేష్ హామీ

ఆదోని, (రాయలసీమ, ప్రభన్యూస్ బ్యూరో) : యువగళం మహాపాద యాత్రలో భాగంగా ప్రతి 100 కిలోమీటర్లకు ప్రత్యేకంగా హామీ ఇచ్చి శిలాఫలకం ఆవిష్కరించే ఆనవాయితీని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కొనసాగిస్తున్న విషయం విదితమే.. ఈ క్రమంలోనే లోకేష్ తన పాదయాత్రలో 77వ రోజు (శుక్రవారం) కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం వర్గం చేరుకున్నారు. ఆదోని గుండా కొనసాగిన పాదయాత్ర సాయంత్రం సిరిగుప్ప క్రాస్ వద్దకు చేరుకోవడంతో 1000 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి. 1000 కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్ 21ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు లోకేష్ ప్రకటించారు.

కనీస మౌలిక వసతులు లేక దళితులు, బీసీలు, మైనార్టీలు పడుతున్న బాధలు నేను ప్రత్యక్షంగా చూసానని. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డ్ను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని. త్రాగునీరు, డ్రైనేజ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.. ఆ హామీ చిహ్నం గా అక్కడ శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు. తన పాదయాత్ర రాయలసీమ గడ్డపై ఈ నేలపై 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేయడం నా అదృష్టంగా భావిస్తూ, అంటూ నా యాత్రను సఫలీకృతం చేసిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు.

రాయలసీమ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక ఆయుధంలా ఉపయోగపడిందన్నారు. రాయలసీమ సమగ్ర అభివృద్ది కోసం యువత ఆలోచనలు, అభిప్రాయాలను ఈ దిగువ వాట్సాప్ నెంబర్లో నేరుగా నాకు తెలియజేయాల్సిందిగా కోరారు. వాట్సాప్ నెం.96862 – 96862, Registration form: https://yuvagalam.com//register, Email Id: [email protected] ద్వారా మీ మనోభావాలను నేరుగా నాతో పంచుకోవచ్చునని లోకేష్ పిలుపు నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement