Saturday, May 4, 2024

WGL: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు… 2వేల లీటర్ల బెల్లంఊట ధ్వంసం

తొర్రూరు టౌన్, అక్టోబర్ 20 (ప్రభ న్యూస్) : మండలంలోని తులసియా తండా, సోమారపు కుంట తండాలో గుడుంబా స్థావరాలపై శుక్రవారం ఉదయం తొర్రూర్ పోలీసులు దాడులు చేపట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళలో గ్రామాల్లో బెల్ట్ షాపులు, గుడుంబా స్థలాలపై ఉక్కు పాదం మోపుతున్నారు.

ఈ దాడుల్లో 30లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, 2000 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో తొర్రూరు సీఐ సత్యనారాయణ, ఎస్సై జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు. నలుగురిపై కేసులు నమోదు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement