Saturday, December 7, 2024

కారు, బైక్ ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఒక‌రికి స్వ‌ల్ప గాయాలు.. వ‌రంగ‌ల్ జిల్లాలో ఘ‌ట‌న‌

వరంగల్ జిల్లాలో రెండు వేహిక‌ల్స్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. నర్సంపేట మండలం లక్నేపల్లీ శివారులో ఇవ్వాల (శ‌నివారం) రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శివ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎయిర్ బ్యాగ్స్‌ తెరుచుకోవడం ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎస్సై బొజ్జ రవీందర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement