Wednesday, May 1, 2024

WGL: మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి… ఎమ్మెల్యే గండ్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలన శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన ఉంటుందని, ఈ పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలు అమలు ఉంటాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి తెలిపారు. శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మంత్రి పర్యటన షెడ్యూల్ వెల్లడించారు.

మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా భూపాలపల్లికి చేరుకుంటారు. భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన 2 ఫేస్ డబల్ బెడ్ రూమ్ లను లబ్దిదారులకు, నూతనంగా వచ్చిన 1100 మంది లబ్దిదారులకు దలితబంధు అమలు పత్రాలను అందిస్తారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 3000 గృహాలక్ష్మి వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి మరో 1500 గృహాలు కూడా అదనంగా మంజూరు చేశారని తెలిపారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్ హరిబాబు, టౌన్ అద్యక్ష్యులు జనార్ధన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement