Wednesday, May 1, 2024

First List – ఢిల్లీలో కొన‌సాగుతున్న క‌స‌ర‌త్తు – 10న కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ ?

హైద‌రాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఈ నెల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ టికెట్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుండగా.. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి.

రేపు తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుండగా కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి అందించనున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీకి అభ్యర్ధులను విడతల వారీగా ప్రకటించాలా… లేదా ఒకేసారి మొత్తం జాబితాను ప్రకటిస్తారా అనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ 10న తొలి విడ‌త జాబితాలో మాత్రం విడుద‌ల కావ‌చ్చ‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement