Sunday, April 28, 2024

WGL: కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన గృహాలు…

వరంగల్ జిల్లా: ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్ధన్నపేట మండల పరిధిలో అక్కడక్కడ నివాస గృహాలు కూలిపోయాయి. రామోజీ కుమ్మరిగూడెం తండాలో భూక్య గోపాల్ అనిత నివాస గృహం కూలిపోయి నేలమట్టమైంది. ఇల్లంద గ్రామంలో సాత్తుపల్లి బాబు ఇల్లు కూలిపోయింది. ఇదే గ్రామానికి చెందిన కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం వద్ద గ్రామంలోకి వరద నీరు చేరి వాగును తలపిస్తున్నట్లుగా దర్శనమిస్తోంది. ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement