Friday, May 3, 2024

Bhupalapalli: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎమ్మెల్యే గండ్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : గత రెండు రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరణారెడ్డి సూచించారు. గురువారం ఫోన్ ద్వారా ప్రజా ప్రతినిధులతో, అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. రానున్న రెండు రోజులు కూడా అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు నది తీరాలు, అడవి గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయాలని, కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

వాతావరణ శాఖ రెడ్ అండ్ ఆరేంజ్ జోన్ లుగా విభజించి వర్షాపాతం నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షపాతం నమోదు పట్ల ముఖ్యమంత్రి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారన్నారు. పాఠశాలలకు గురు, శుక్రవారం ప్రభుత్వం సెలవులు ప్రకంటించిందన్నారు. చిట్యాల మండలం వెంచరామి, కాల్వపల్లి, టేకుమాట్ల మండలం బుర్నపల్లి, ఎంపెడు, భూపాలపల్లి రూరల్ గ్రామాల ప్రజలు, మహాదేవ్ పూర్, పలిమేల మండల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వాయంతో పనిచేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement